Saturday, April 27, 2024

మాల్దీవుల విషయంలో మోదీ సాధించిన అసలైన విజయం ఇదే!

Share

బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటు భారతీయులు లేవనెత్తిన స్లోగన్ దెబ్బకు ప్రస్తుతం మాల్దీవుల్లోని నాయకులకు నిద్ర పట్టడం లేదు. భారత ప్రధాన మంత్రి మోదీ, మరియు భారత దేశ పర్యాటకం చేసిన వాఖ్యలు వారి వ్యక్తిగతం మా ప్రభుత్వానికి, మాదేశానికి ఏ మాత్రం సంబంధం లేదు క్షమించండీ బాబు అని ఆ దేశ అధినేత మొహమ్మద్ ముయిజ్జు మొత్తుకునే పరిస్థితితో పాటు, అవసరం అయితే అతన్ని అధికారం నుండి దించడానికి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే స్థాయికి చేరింది.

ప్రపంచంలో ఏ దేశంపైనా అయిన మరో దేశ నాయకులు లేదా కీలక వ్యక్తులు అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేస్తే, వాటిని ఆ దేశ నాయకులు లేదా ఫారిన్ మినిస్టర్లు ఖండించే వారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి. ప్రజలు సైతం మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా ఉండేవారు.

మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వపు నిర్ణయాలపై అనేక విమర్శలు ఉన్నప్పటికి, దేశం మొత్తన్ని ఒక తాటిపైకి తీసుకు వచ్చేందుకు వారు అంతర్గతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయనేది నిజం.

గతంలో గంటలు కొట్టించినా, దీపాలు వెలిగించినా, మన్ కీ భారత్ అంటూ కార్యక్రమాలు నిర్వహించినా.. అది అందరిని ఒకటి చేయడం కోసమే అన్నది స్పష్టం అవుతుంది. పాకిస్థాన్ తో మోదీ వైఖరి, ఉగ్ర క్యాంపులపై దాడులు, చైనా విషయంలొ దూకుడు, ఉక్రేయిన్ – రష్యా మరియు ఇజ్రయిల్- హామాస్ మధ్య జరుగుతున్న యుధ్దాల్లో ప్రభుత్వ వైఖరీ, ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో కెనాడా దేశాన్నే వ్యతిరేఖించడం, ధైర్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా G20 సమ్మిట్ ఇలా అనేక కీలక సందర్భాల్లో దేశమే ముఖ్యం అనే వైఖ్యరిని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకు వెళ్లారు.

రాజకీయ పయోజనాల కంటే, దేశ ప్రయోజనాలే ముఖ్యం అందుకోసం ఎంతకైనా తెగిస్తాం అనే విషయాన్ని ప్రజల్లో స్పష్టంగా తీసుకువెళ్లడంలో కచ్చితంగా విజయం సాధించరనడంలో సందహం లేదు. ఇదంత గమనిస్తున్న ప్రజలు అంతర్గతంగా ఎలా ఉన్న దేశ సమస్యల్లో అందం ఒక్కటే అనే భావనకు వచ్చారు.

భారత ప్రజలు దేశం కోసం ఒక్కటి అయ్యారనే దానికి స్పష్టమైన ఉదాహారణ మాల్దీవుల ఘటన. ఇక్కడ ప్రజల దెబ్బకు మాల్దీవుల్లో పర్యాటకం తగ్గింది, ఇద్దరు మంత్రుల సస్పెండ్ అయ్యారు, ఏర్పడిన కొన్నాళ్లకే కూలిపోయే స్థితిలో ఉంది అక్కడి ప్రభుత్వం. మరో సారి ఏ దేశమైన భారత్ విషయంలో వేలు పెట్టే ముందు నాయకులతో పాటు ఇక్కడి ప్రజలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కచ్చితంగా మోదీ విజయమే.

Read more

Local News